Nallamala Vaalimama Prapancham-Set of 5 Vols
Suresh Veluguri Larger than life - Nallamala VaaliMaama అతనొక చెంచు గిరిజన వీరుడు. నల్లమల అరణ్యంలో ఒక తట్టుకు పరిధుల్లేని మొనగాడు. అడవిని, ప్రకృతిని కాపాడుకోవడంలో ఎన్నడూ దేనికీ వెరవనివాడు. కల్దారి భారీవంతెనను దాదాపు అర్థ శతాబ్దం పాటు తన సొంతమన్నట్లుగా కాపాడుకున్నవాడు. గిరిజనుల హక్కుల సాధనకు ఉద్యమించినవాడు. అడవినీ, ప్రకృతి సూత్రాలనీ అందరికీ విడమర్చిచెప్పినవాడు. అడవుల్లేకపోతే తరతరాలూ ఎలా నష్టపోతాయో వివరిస్తూ, అడవుల్ని బతికించుకోవల్సిన అవసరాల్నిఅనుభవపూర్వకంగా చెప్పినవాడు. అడవంటే ఒక ఆలోచన. ఆ ఆలోచనలో వాలిమామ ఎప్పటికీ జీవించేవుంటాడు. "నల్లమల వాలిమామ" ఒక కల్పిత పాత్రే అయివుండొచ్చు. కానీ, కొన్ని తరాలపాటు ప్రతి మనిషీ ఆరోగ్యకరంగా జీవించడానికి వేయాల్సిన దారులను చూపించినవాడు. ఇప్పుడు నడుస్తున్న వాతావరణ పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ, మనం మార్చుకోవాల్సిన పద్ధతుల్ని తెలిపిసవాడు. వాలిమామతో కలిసి నడవడమంటే ... వందేళ్లపాటు మనం ఆరోగ్యంగా జీవించడం. ఈ సత్యాన్ని గుర్తించినవారంతా వాలిమామను అనుసరిస్తారు. నమ్మనివార